ప్రధాని మోడీకి గుడి కట్టించిన రైతు

సినీ నటులకు, ఆటగాళ్లకు అభిమానులుండటం సహజం. వారిపై అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోరకంగా చాటుకుంటారు. అన్నదానాలు, రక్తదానాలు చేస్తుంటారు. మరికొందరు వారి పేర్లను..తమ పిల్లలకు కూడా పెట్టుకుంటారు. అయితే సినీ నటులకు, ప్లేయర్లకే కాదు…రాజకీయనాయకులకు కూడా అభిమానులున్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీకి వీరాభిమాని అయిన ఓ రైతు ఆయనకు ఏకంగా ఓ గుడి కట్టించి…రోజూ పూజలు కూడా చేస్తున్నాడు.

తమిళనాడు తిరుచిరాపల్లిలోని ఎరకుడికి చెందిన శంకర్‌ అనే రైతుకు ప్రధాని మోడీ అంటే ఎంతో అభిమానం. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఆయన లబ్దిపొందాడు. దీంతో మోడీ పై మరింత అభిమానం పెరిగింది. ఆ అభిమానంతో తన పొలంలోనే లక్షా యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఏకంగా మోడీకి గుడి కట్టించాడు. అంతేకాదు ఆ గుడిలో రోజు ఉదయాన్నే పూజలు కూడా చేస్తున్నాడు. 8 నెలల క్రితం ఈ గుడి నిర్మాణం ప్రారంభించామని..గత వారమే ప్రారంభించినట్లు తెలిపాడు శంకర్. ఈ గుడిలో మోడీ విగ్రహంతో పాటు తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత, తమిళనాడు సీఎం పళనిస్వామి, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ నేత కే కామరాజ్‌ ఫొటోలు కూడా ఉన్నాయి.

Latest Updates