నిప్పురవ్వలు పడి పేలిన పటాకుల గోడౌన్..

తమిళనాడులోని ఓ గుడిదగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. భారీ ఎత్తున ఎగిసిన నిప్పురవ్వలు ఎగిరి పక్కనే ఉన్న  పటాకుల గోడౌన్ లలో పడ్డాయి. దీంతో రెండు పటాకుల అంగళ్లు అగ్నికి అహుతి అయ్యాయి. ఈ ఘటన తమిళనాడులోని శివగంగయ్ సమీపంలో కలోయార్ కొయిల్ టెంపుల్  దగ్గర జరిగింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగింది. సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎగిసి పడుతున్న మంటలను ఆర్పుతున్నారు. దీపావళి కావడంతో పటాకుల గోడౌన్లు, దుఖానాల దగ్గర జనాల సందడి నెలకొంది. ఇప్పటికే అన్ని చోట్లా టపాకుల దుఖాణాలను గ్రౌండ్స్ లో ఏర్పాటు చేశారు.

 

Latest Updates