ఒకదాని వెనక ఒకటి ఏడు కార్లు ఢీ.. ఐదుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకదాని వెనక ఒకటి.. వరుసగా ఏడు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు.. 21 మంది గాయపడ్డారు. ప్రమాదంలో కార్లన్నీ నుజ్జునుజ్జయ్యాయి. మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. పుదుకోటై – తిరుచ్చి రహదారిలోని నార్తా మలై రైల్వే పాలిటెక్నిక్ కాలేజీ ఎదురుగా ఈ ఘటన జరిగింది. గాయపడ్డవారిని స్థానికులు దగ్గరలోని హాస్పిటల్ కు తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లంటున్నారు.

Latest Updates