దుబాయ్‌‌‌‌ తీసుకెళ్లి బార్‌‌‌‌లో డ్యాన్స్‌‌‌‌ చేయమన్నాడు

ఓ మోసగాడి వలలో నలుగురు మహిళలు

దుబాయ్‌‌‌‌: జాబ్‌‌‌‌ ఇప్పిస్తానని చెప్పి నలుగురు మహిళలను దుబాయ్‌‌‌‌ తీసుకెళ్లాడు. అక్కడికెళ్లాక బార్‌‌‌‌ డ్యాన్సర్లుగా పని చేయమన్నాడు. విషయం తెలుసుకున్న దుబాయ్‌‌‌‌ పోలీసులు వాళ్లను ఆ మోసగాడి బారి నుంచి కాపాడారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌‌‌‌కు చెందిన నలుగురు మహిళలకు ఈవెంట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి దుబాయ్‌‌‌‌ తీసుకెళ్లాడు. అక్కడికెళ్లాక వాళ్లను ఓ రూంలో బంధించి డ్యాన్సర్లుగా చేయాలని బెదిరించాడు. నలుగురిలో ఓ మహిళ ఎలాగొలా వాట్సాప్‌‌‌‌ ద్వారా తన ఫ్యామిలీకి మెసేజ్‌‌‌‌ పంపింది. విషయం తెలుసుకున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వెల్లమ్‌‌‌‌వెల్లి మురలీధరన్‌‌‌‌.. దుబాయ్‌‌‌‌లోని ఇండియన్‌‌‌‌ కాన్సులేట్‌‌‌‌ను అలర్ట్‌‌‌‌ చేశారు. దుబాయ్‌‌‌‌ పోలీసులకు కాన్సులేట్‌‌‌‌ విషయం చెప్పడంతో వెంటనే స్పందించి మహిళలను కాపాడారు. నలుగురు మహిళలను శనివారం కోజికోడ్‌‌‌‌ పంపామని కాన్సుల్‌‌‌‌ జనరల్‌‌‌‌ విపుల్‌‌‌‌ తెలిపారు. వాళ్లను మోసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు.

Latest Updates