సర్కారీ స్కూళ్ల స్టూడెంట్స్‌‌‌‌కు మెడికల్‌‌ సీట్లలో 7.5% రిజర్వేషన్‌‌‌‌

  • ఆర్డినెన్స్​కు తమిళనాడు గవర్నర్​ ఓకే

చెన్నై: గవర్నమెంట్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌లో చదివి నేషనల్‌‌‌‌ ఎల్జిబులిటీ కమ్‌‌‌‌ ఎంట్రెన్స్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ (నీట్‌‌‌‌) క్వాలిఫై అయిన స్డూడెంట్స్‌‌‌‌కు ఇక నుంచి తమిళనాడులోని మెడికల్‌‌‌‌ కాలేజీ సీట్లలో 7.5 శాతం రిజర్వేషన్‌‌‌‌ వర్తించనుంది. ఈ మేరకు ప్రభుత్వం రూపొందించి, అప్రూవ్‌‌‌‌ చేసిన బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్‌‌‌‌‌‌‌‌ బన్వరీలాల్‌‌‌‌ పురోహిత్‌‌‌‌ ఆమోదించారని గవర్నర్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ శుక్రవారం ప్రకటించింది. బిల్లుపై సొలిసిటర్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌కు ఒపీనియన్‌‌‌‌ కోరారని, అక్టోబర్​29న ఒపియన్‌‌‌‌ రాగానే గవర్నర్‌‌‌‌‌‌‌‌ ఆమోదం తెలిపారని అన్నారు. బిల్లును కావాలనే ఆలస్యం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేయడంతో రాజ్‌‌‌‌భవన్‌‌‌‌ క్లారిటీ ఇచ్చింది. 2020–21 అకడమిక్‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌లోనే ఇది అమలవుతుందని అధికారులు చెప్పారు.

Latest Updates