కేసు వాపస్ తీసుకో: రేప్ బాధితురాలిని బెదిరించిన లేడీ లాయర్

తమిళనాడు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు రేప్ బాధితురాలు. తమిళనాడు తిరువళ్లూరుకు చెందిన ఓ మైనర్ బాలికను వాళ్ల పక్కింట్లో ఉండే 20 సంవత్సరాల యువకుడు 2015లో రేప్ చేశాడు. ఈ రేప్ కేసు కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. ఈ కేసును స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధనలక్ష్మి వాదిస్తున్నారు. అయితే  కేసును వాపసు తీసుకోవాలని రేప్ అయిన అమ్మాయిని ఆమె కుటుంబసభ్యులను ధనలక్ష్మి బెదిరించినట్లు పోలీసులకు తెలిపింది రేప్ బాధితురాలు. రేప్ చేసినతన్ని పెళ్లి చేసుకోవాలని లేదా అతను ఇచ్చే ధనాన్ని తీసుకుని కేసును విత్ డ్రా చేసుకోవాలని బెదిరించినట్లు చెప్పింది ఆ అమ్మాయి.

న్యాయస్థానంలో వాధనలు జరిగిన తర్వాత తనను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధనలక్ష్మి తన చాంబర్ కు పిలిపించుకుందని తెలిపింది రేప్ బాదితురాలు. అయితే అప్పుడు తనతో కుటుంబసభ్యులను ఎవరినీ కూడా తన చాంబర్ లోకి అనుమతించలేదని చెప్పింది. తాను చాంబర్ లోకి వెళ్లగానే తనను రేప్ చేసిన అతను కూడా అక్కడే ఉన్నాడని అతనితో కలిసి మాట్లాడేందుకు ధనలక్ష్మి బలవంతపెట్టిందని తెలిపింది. అయితే తాను అతన్ని చూసిన వెంటనే భయంతో వనికి పోయానని, గోడకు ఆనుకుని గట్టిగా ఏడ్చానని తెలిపింది ఆయువతి. తమను ఫిర్యాదును వాపసుతీసుకొవాలని కోరుతున్న ధనలక్ష్మిపై యాక్షన్ తీసుకోవాలని పోలీసులను కోరింది ఆ అమ్మాయి.

Latest Updates