తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి గా ఠాకూర్..హ‌ర్షం వ్య‌క్తం చేసిన పొన్నం

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి గా త‌మిళ‌నాడు ఎంపీ మాణికం ఠాకూర్ నియామకం పట్ల కాంగ్రెస్ నేత పొన్నం ప్ర‌భాక‌ర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర క‌మిటీల‌తో సహా కీలక మార్పులు చేసి ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేశారు.

ఇప్ప‌టిదాకా తెలంగాణ ఇంచార్జ్ గా వ్యవహరించిన కుంతియాని తొలగించారు. పార్టీకి చెందిన ఏ కమిటీలోనూ కుంతియాకి చోటు దక్కలేదు. ఆయన స్థానంలో తమిళనాడు విరుధానగర్ పార్లమెంట్ సభ్యులు మాణికం ఠాకూర్ ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గా నియ‌మించారు.

మాణికం ఠాకూర్ నియామ‌కంపై తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నం ప్ర‌భాక‌ర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. విద్యార్థి విభాగం, యూత్ కాంగ్రెస్ ల‌లో సంస్థాగతంగా పనిచేసిన అనుభవం ఉన్న యువ నాయకులు ఠాకూర్ అంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఆయనను ఇంచార్జి గా వేయడం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ మరింత బలపడుతుంద‌ని పొన్నం ధీమా వ్య‌క్తం చేశారు.

Latest Updates