ఆస్కార్ గెలిచిన పారాసైట్ నా సిన్మాకు కాపీ

పారాసైట్ .. ఆస్కార్ రేసులో నిలిచిగెలిచిన దక్షిణ కొరియా సినిమా. కానీ,ఆ సినిమా కాపీ సినిమానట. తమిళ సినిమానుకాపీ కొట్టి తీశారట. మామూలుగా హాలీవుడ్ సినిమాలను ఇన్ స్పిరేషన్ గా తీసుకుని ఇక్కడ సినిమాలు రావడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ, ఇక్కడ రివర్స్​ జరిగిందంటున్నారు తమిళ నిర్మా త పీఎల్ థెనప్పన్ . అవును, విజయ్‌ , రంభ హీరో హీరోయిన్లుగా 1999లో తాను నిర్మించిన రొమాంటిక్ కామెడీ సినిమా మిన్సారా కన్నాను కాపీ కొట్టి ‘పారాసైట్’ సినిమా తీశారని ఆరోపించారు. సోషల్ మీడియాలో ఆయన చేసినకామెంట్లను చాలా మంది జోక్ గా తీసుకున్నారు. కొడితేగిడితే మనం కాపీ కొడతాం గానీ, వాళ్లకు కాపీ కొట్టాల్సిన ఖర్మేంటని అన్నారు. కానీ, ఇప్పుడది సీరియస్ టర్న్​ తీసుకుంది.పారాసైట్ సినిమా నిర్మాతలపై దావా వేస్తానని థెనప్పన్ బాంబు పేల్చారు.

‘‘సోమవారం లేదంటే మంగళవారం ఇంటర్నేషనల్ లాయర్ సాయంతో పారాసైట్ నిర్మాతలపై కేసు వేస్తా.వాళ్లు నా సినిమాను కాపీ కొట్టారు. ఆ ప్లాట్ నే తీసుకున్నారు. వాళ్ల సినిమాలను ఇన్ స్పిరేషన్ గా తీసుకుని మేం సినిమాలు చేస్తే వాళ్లూ కేసులు వేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్లు కూడా నా సినిమాను కాపీ కొట్టారు. కాబట్టి నేను కూడా కేసు వేయడం న్యా యమే కదా’’ అని అంటున్నారు. మరోవైపు మిన్సారా కన్నాను డైరెక్ట్​ చేసిన కేఎస్ రవికుమార్ కూడా దీనిపై  స్పందించారు.‘నా కథ’కు ఇంటర్నేషనల్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ‘‘మిన్సారా కన్నాను ఇన్ స్పిరేషన్ గా తీసిన పారాసైట్ కు ఆస్కార్ రావడం సంతోషంగా ఉంది. అయితే, దాని పైదావా వేయడమన్నది నిర్మాతకు సంబంధించింది’’ అని ఆయన అన్నారు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates