తెలుగు వారికి నమస్కారం : తమిళిసై

తెలంగాణకు గవర్నర్ అవడం సంతోషంగా ఉందన్నారు తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళిసై సౌందరరాజన్. తెలుగు వారందరికీ నమస్కారం అంటూ.. తెలుగులో పలకరించారు. తెలంగాణలోని అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములను త్వరలోనే పలకరిస్తానని చెప్పారు. వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. దేశసేవ చేసేందుకు తనకు అవకాశమిచ్చిన ప్రధాని మోడీ, పార్టీ చీఫ్ అమిత్ షాకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. సాధారణ కార్యకర్తగా పార్టీలోకి వచ్చిన తనకు గవర్నర్ గా బాధ్యతలివ్వడం.. గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. గవర్నర్ గా నియమితులైన తమిళిసాయిని తమిళనాడు బీజేపీ నేతలు సన్మానించారు.

Latest Updates