తమిళిసైకి స్వాగతం పలికిన సీఎం, మంత్రులు

tamilisai-soundarajan-gets-warm-welcome-in-begumpet-airport-by-cm-kcr-and-officials

రాష్ట్ర గవర్నర్ గా అపాయింట్ అయిన తమిళిసై సౌందరరాజన్ కు బేగంపేట ఎయిర్ పోర్టులో సాదర స్వాగతం పలికారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రులు, అధికారులు సీఎం కేసీఆర్ తో కలిసి… సౌందరరాజన్ కు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆమె పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

చెన్నైనుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు తమిళిసై సౌందరరాజన్. అక్కడినుంచి స్పెషల్ హెలికాప్టర్ లో బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చారు. సీఎం ఆమెకు ఫ్లవర్ బొకే ఇచ్చి స్వాగతం పలికారు. ఆ తర్వాత నాయకులంతా.. రాజ్ భవన్ కు బయల్దేరి వెళ్లారు. 11 గంటలకు గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలవుతుంది.

Latest Updates