కాసేపట్లో గవర్నర్‌గా తమిళిసై ప్రమాణ స్వీకారం

tamilisai-soundararajan-to-take-oath-today-as-telangana-governor

రాష్ట్ర గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ ఇవాళ ఉదయం ప్రమాణం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అంతా సిద్ధం చేశారు. జీఏడీ అధికారులు, రాజ్ భవన్ అధికారులు సంయుక్తంగా ఏర్పాట్లు పూర్తిచేశారు.

ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో..  రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్….. గవర్నర్ గా తమిళిసైతో ప్రమాణం చేయిస్తారు. కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రులు హాజరవుతారు.

ఈ ఉదయం 8.30 గంటలకు తమిళిసై చెన్నైనుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఆమెకు రాష్ట్ర అధికారులు స్వాగతం పలుకుతారు. రాజ్ భవన్ కు తీసుకుని వస్తారు. గవర్నర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.

Latest Updates