త‌మిళ‌నాడులో ల‌క్ష‌కు చేరువ‌లో క‌రోనా కేసులు

తమిళనాడులో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయి 4343 కేసులు, 57 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 98,392కి పెరగ్గా.. మరణాల సంఖ్య 1321కి చేరింది. ఇక చెన్నై నగరంలో కరోనా వైరస్‌ మరింతగా విజృంభిస్తోంది. ఒక్క ఈ నగరంలోనే ఈ రోజు 2027 కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 62,598కి చేరుకుంది. కరోనాసోకినవారిలో 38947 మంది కోలుకొని డిశ్ఛార్జి కావడంతో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 22686గా ఉంది. చెన్నైలో ఇప్పటిదాకా 960మందికి పైగా మరణించారు.

 

Latest Updates