వీడియో: టోల్ గేట్ వద్ద పోలీసును తన్నిన మాజీ ఎంపీ

లాక్డౌన్ కావడంతో పాస్ చూపించమని అడిగిన పోలీస్ అధికారిని ఓ ఎంపీ తన్నిన ఘటన తమిళనాడులో ఆదివారం రాత్రి జరిగింది. AIADMK సభ్యుడు, మాజీ ఎంపీ అయిన అర్జునన్.. సేలం టోల్ గేట్ వద్ద విధుల్లో ఉన్న ఒక పోలీస్ అధికారిని తిట్టడమే కాకుండా.. తన్నాడు. ఈ ఘటన మొత్తం టోల్ గేట్ సీసీ కెమెరాలో రికార్డయింది.

తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతండటంతో మళ్లీ లాక్డౌన్ విధించారు. అత్యవసర సర్వీసులు తప్ప ఎవరైనా పాసులు తీసుకుంటేనే బయటకెళ్లాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే AIADMK సభ్యుడు, మాజీ ఎంపీ అయిన అర్జునన్ సేలం చెక్ పోస్ట్ గుండా వేరే జిల్లాకు వెళ్తున్నారు. దాంతో టోల్ గేట్ దగ్గర డ్యూటీలో ఉన్న పోలీసులు.. అర్జునన్ కారును ఆపి పాస్ చూపించాలని కోరారు. దాంతో ఎంపీనైన నన్నే పాస్ అడుగుతావా అంటూ.. అర్జునన్ పోలీస్ అధికారిని దుర్భాలాషలాడాడు. దాంతో పోలీస్ అధికారికి, అర్జునన్ కు వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన అర్జునన్.. పోలీస్ అధికారిని తోసేశాడు. దాంతో పోలీస్ అధికారి కూడా.. అర్జునన్ ను తోసేశాడు. నన్నే తోసేస్తావా అంటూ అర్జునన్.. ఆ పోలీసును తన్నాడు. అక్కడే ఉన్న మరికొంతమంది పోలీసులు వారించి గొడవను ఆపారు. అర్జునన్ దగ్గర ఎటువంటి పాస్ లేదని పోలీసులు తెలిపారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లాలంటే పాస్ తప్పనిసరి చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మాజీ ఎంపీ అర్జునన్.. ఐపీసీ మరియు సిఆర్ పీసీ చట్టాల ప్రకారం అనేక నియమాలను ఉల్లంఘించారు. బహిరంగ ప్రదేశాలలో గొడవ చేయడం, అధికారులను దుర్భాషలాడటం, ప్రభుత్వ అధికారుల విధులను అడ్డుకోవడం, అధికారులపై దాడి చేయడం మరియు హత్య చేస్తానని బెదిరించడం
మొదలైన కేసులన్నీ ఆయనపై నమోదు చేయవచ్చు. కానీ.. ఇప్పటివరకు అర్జునన్ పై ఎటువంటి కేసు నమోదు కాలేదు. అర్జునన్ అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడంతోనే.. ఆయనపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

For More News..

ప్రజల నుంచి బీజేపీ రూ. 18 లక్షల కోట్లు వసూల్ చేసింది

హైదరాబాద్ లో వైరల్ అవుతున్న కరోనా డెడ్ బాడీల ఫేక్ న్యూస్

హైదరాబాద్లో.. మళ్లీ లాక్డౌన్! అన్నీ సిద్ధం చేయాలని సీఎం సూచన

Latest Updates