బొటనవేలు దెబ్బకు ప్రతీకారం తీర్చుకుంటాం: తమ్మినేని

ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం

ముషీరాబాద్, వెలుగు: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలు గురుదక్షిణగా తీసుకున్నట్లు కుట్రపూరితంగా రంగారావు వేలు కేసీఆర్ తీసుకున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మి నేని వీరభద్రం మండిపడ్డారు . బొటనవేలు దెబ్బకు ప్రతీకారం తీర్చుకుంటా మన్నారు . ముఖ్యమంత్రి మాట్లాడిన తీరును నిరసిస్తూ శుక్రవారం ముషీరాబాద్ సుందరయ్య విజ్ఞా న కేంద్రంలో తమ్మి నేని వీరభద్రం ప్రెస్ మీట్ లో మాట్లాడారు.

ఉద్యమ సమయంలో సీపీఐ ఎంఎల్ కేసీఆర్ తో కలిసి పోరాటం చేసిందని,ఉద్యమం సందర్భంగా ఖమ్మం ఆసుపత్రిలో కేసీఆర్ కు అండగా ఉన్నది పోటు రంగారావే అని తమ్మినేని గుర్తు చేశారు. పేదవారికి ఆర్టీసీ తప్ప వేరే మార్గం లేదని, ఆర్టీసీ సమస్య కాదని… ప్రజలకు అవసరమైన వ్యవస్థని అన్నారు . హుజూర్ నగర్ విజయంతో ఇలా గర్వంతో మాట్లాడుతున్నారని… ఈ విజయం ధన,అధికార దుర్వినియోగ విజయమన్నారు . సమ్మె ను ముందుకు తీసుకువెళ్తామన్న కార్మికులకు పార్టీ తరఫున అండగా ఉంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పిం చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తామని తెలిపారు.వేలు కాదు తల పోయినా నరహంతక విధానాలను ఎదిరించి పోరాటం కొనసాగిస్తామని సీపీఐ ఎంఎల్ సహాయ కార్యదర్శి పోటు రంగారావు అన్నారు . ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరుపై నేటి నుంచి నిరవధిక దీక్షకు కూర్చుంటామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనం నేని సాంబశివరావు తెలిపారు.

అన్ని అసత్యాలు..అర్ధసత్యాలు: కోదండరాం

ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో వీధి నాయకుడి తరహాలో మాట్లా డటం దురదృష్టకరమని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు .ముఖ్యమంత్రి అన్ని అసత్యాలు.. అర్ధసత్యాలు మాట్లాడారని విమర్శించారు. కార్మికులు అవార్డులు తెచ్చారంటూనే నష్టాలకు కారణమని చెప్పడం ఎక్కడి న్యాయమని ప్రశ్నిం చారు. ప్రజల పట్ల ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పేదల రవాణాకు ఆర్టీసీ తప్ప వేరే మార్గం లేదన్నారు.

tammineni veerabhadram Press Meet at the Musheerabad Sundarayya Vignana Center on RTC employees

Latest Updates