సాహో ఎలా ఉందో ఒక్కమాటలో తేల్చేసిన తరణ్ ఆదర్శ్

ప్రభాస్ నటించిన సాహో సినిమా అభిమానులను, సినీ ప్రేక్షకులను దారుణంగా నిరాశపర్చింది. టెక్నికల్ గా, గ్రాఫిక్స్ పరంగా.. యాక్షన్ సీక్వెన్సుల పరంగా సినిమా భారీగా ఉంటుందని సినిమా యూనిట్ చెప్పడంతో….. మూవీపై ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ, తెలుగు సినీ అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఐతే.. కనీసం ఎంటర్ టైన్ చేయలేక సాహో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీపై బాలీవుడ్ లో ప్రముఖ విమర్శకుడు, ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ రివ్యూ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

తనదైన శైలిలో సాహోపై వన్ వర్డ్ రివ్యూ ఇచ్చారు తరణ్ ఆదర్శ్. సాహోను భరించలేం అని అన్నారు. ఒకటిన్నర స్టార్స్ తో రేటింగ్ ఇచ్చారు. సముద్రమంత ప్రతిభ, కోట్ల రూపాయల బడ్జెట్ వేస్ట్ అయిపోయాయన్నారు. అద్భుతమైన అవకాశం కూడా వృధాగా పోయిందన్నారు. బలహీనమైన కథ, కన్ ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే, పరిణతిలేని దర్శకత్వంతో ప్రభాస్, సినిమా అభిమానులను సాహో నిరాశపరిచిందని చెప్పారు తరణ్ ఆదర్శ్.

Latest Updates