ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్‌గా తరుణ్ బజాజ్‌

ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్‌గా ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్‌ను ప్రతిపాదిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. తరుణ్ బజాజ్‌ను ఆర్బీఐ డైరెక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ యోగేశ్ దయాల్ తెలిపారు.

తరుణ్ బజాజ్ మే 5, 2020 నుండి బాధ్యతలు తీసుకుంటారని కేంద్రం తెలిపింది. 1988 బ్యాచ్ హర్యానా కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన తరుణ్ బజాజ్ మే 1న ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో ప్రధానమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాకుండా.. ఆర్థిక సేవల విభాగంలో జాయింట్ సెక్రటరీ మరియు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

For More News..

యాక్టర్ శివాజీ రాజాకు హార్ట్ఎటాక్

జైలులో మర్మాంగాలను కత్తిరించుకున్న ఖైదీ

కారులో బిడ్డను ప్రసవించిన గర్భవతి

Latest Updates