సైకో కిల్లర్ రాములును అరెస్ట్ చేసిన టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు

హైదరాబాద్: సైకో కిల్లర్ రాములు హత్యలపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని హతమారుస్తున్న రాములును పోలీసులు పట్టుకున్నారు. గతంలో రాములుపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన నేపథ్యంలో ఆ యాంగిల్‌‌లో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. జైలు నుంచి పారిపోయి మళ్లీ హత్యలు చేస్తున్న రాములును హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్, బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అతడిపై కేసులు నమోదు చేశారు. రాములుకు సంబంధించిన వివరాలను పోలీసులు మంగళవారం వెల్లడించనున్నారు.

Latest Updates