లాక్ డౌన్ లో ఇమ్యూనిటీని పెంచే జ్యూస్ లు

‘‘ఏ కాలంలో దొరికే పండ్లు, కూరగాయలు ఆ కాలంలో తప్పకుండ తినాలె’’ అంటుంటరు పెద్దోళ్లు. పెద్దోళ్లు చెప్పినా.. పెద్ద పెద్ద డాక్టర్లు చెప్పినా అదే మాట. ముఖ్యంగా సమ్మర్లో హెల్దీగా ఉండాలంటే.. సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్ జ్యూస్లు తాగాలి. లాక్డౌన్ వల్ల ‘ఎండ తగలకుండా ఇంట్లోనే ఉంటున్నాం కదా!’ అనుకున్నా.. ఇది ఎండాకాలమే. కాబట్టి కచ్చితంగా కేర్ తీసుకోవాలి. లేదంటే డీహైడ్రేషన్, అజీర్తిలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. సీజనల్ ఫ్రూట్స్  పాటు.. కొన్ని కూరగాయల రసాలు కూడా ఇమ్యూనిటీని పెంచుతాయి. అవి తాగితే ఎండ నుంచే కాదు, కరోనా నుంచీ కాపాడుకోవచ్చు.

పుచ్చకాయ

వేసవిలో మాత్రమే దొరికే పుచ్చకాయను అందరూ ఇష్టపడతారు. ఇందులో ఎక్కు నీళ్లు ఉండడం వల్లబాడీ డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. నీళ్లు ఉండడమే కాదు, సమారు 92శాతం విటమిన్– సి, ఏ, బీ1, బీ5, బీ6 లతోపాటు పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ దీనిలో ఉంటాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల హార్ట్, బ్రెయిన్ బాగా పనిచేస్తాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. బాడీలోని టాక్సిన్స్ను బయటకు పంపుతుంది. బ్లడ్ ప్రెజర్ను కంట్రోల్ చేస్తుంది. ఈ జ్యూస్ కళ్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కిడ్నీ స్టోన్స్, డయాబెటిస్ ఉన్నవాళ్లు తాగితే కాస్త రిలీఫ్‌ ఉంటుంది.

కాకరకాయ

దీన్ని కూర వండుకుని తినడం కంటే జ్యూస్ తాగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. రెగ్యులర్ గా తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది. బరువు కూడా తగ్గుతారు. ఇందులో కొలెస్ట్రాల్ను కరిగించే కొన్ని ఎంజైమ్‌లు ఉంటాయి.

 కీరదోస

ఇది హై హైడ్రేటింగ్ డ్రింక్‌‌‌‌లా పనిచేస్తుంది. ఇమ్యూనిటీని పెంచి, బాడీని యాక్టీవ్  ఉండేలా చేస్తుంది. కీరా జ్యూస్‌‌‌‌లో విటమిన్ ఏ, సీ, కేలతోపాటు మెగ్నీషియం, సిలికాన్, పొటాషియం ఉంటాయి. ఎసిడిటీ, గుండెలో మంట, అజీర్ణంలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు తాగితే చాలా తక్కువ టైంలో తగ్గిపోతాయి.

టొమాటో

టొమాటో జ్యూస్ తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అంటున్నారు న్యూట్రీషనిస్ట్‌‌లు. ఇందులో విటమిన్స్ ఏ, సీ, కే, బీ1, బీ3, బీ6, బీ9లతోపాటు ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం, కాపర్ , మాంగనీస్ ఉంటాయి. హై బీపీ, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఉన్నవాళ్లు ఈ జ్యూస్ తాగితే ఆరోగ్యంగా ఉంటారు. చర్మంపై నల్ల మచ్చలు, సన్ టాన్ తగ్గుతుంది. బరువును కూడా తగ్గించుకోవచ్చు. చెరుకు రసం ఎండాకాలంలో ప్రతి రోజూ ఈ జ్యూస్ తాగితే వడదెబ్బనుంచి కాపాడుకోవచ్చు. ఇందులో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫ్యాట్ చాలా తక్కువ. కార్బోహైడ్రేట్లు, షుగర్, ఫైబర్, పొటాషియంతో పాటు విటమిన్ సీ, ఏ, బీ6, కేలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.  లివర్, కిడ్నీల పని తీరుపెరుగుతుంది. ఇన్ స్టంట్  ఎనర్జీని ఇస్తుంది.

పైనాపిల్

పైనాపిల్ ఇమ్యూనిటీని పెంచడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. బాడీ, బ్రెయిన్ను డిటాక్సిఫై చేస్తుంది. ఇందులో ఫైబర్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, విటమిన్ ఏ, సీలు ఉంటాయి. ఈ జ్యూస్ బరువును తగ్గిసగ్గి ్తుంది. డయాబెటిస్, గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది.

మామిడి పండు

మామిడి పండు సమ్మర్లో మిస్ అయితే.. మళ్లీ సమ్మర్ వరకు వెయిట్ చెయ్యాల్సిందే. అందుకే మిస్ కాకుండా ప్రతి సమ్మర్లో మ్యాంగో జ్యూస్ తాగాలి. ఇందులో ప్రొటీన్స్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఐరన్, పొటాషియంతోపాటు విటమిన్ సీ, ఏ, బీ6, కేలు ఉంటాయి. ఇమ్యూనిటీని పెంచుతుంది. హార్ట్, నరాలు, మజిల్స్కి కొత్త ఉత్తేజం ఇస్తుంది. బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. రెడ్ బ్లడ్ సెల్స్ని హెల్దీగా ఉంచుతుంది.

బొప్పాయి

బొప్పాయి సమ్మర్లో ఎక్కువగా దొరికే బొప్పాయి పండ్లలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఈ జ్యూస్ రోజూ తాగితే బరువు తగ్గుతారు. ఇందులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రొటీన్, విటమిన్ సీ, ఏ, బీ9, పొటాషియం ఉంటాయి. ఈ జ్యూస్ ఎముకలకు బలాన్నిస్తుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు తింటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. కొన్ని గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. స్కిన్, హెయిర్ని హెల్దీగా ఉంచుతుంది.

క్యారెట్

క్యారెట్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే బ్యూటీ మినరల్ సిలికా స్కిన్ను కాపాడుతుంది. కంటిచూపు సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గడానికి కూడా ఈ జ్యూస్ ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. క్యారెట్లో ఉండే బీటా కెరోటిన్ విటమిన్‌‌– ఏ గా మారిబాడీకి అందుతుంది. ఇందులో డైటీ ఫైబర్ ఉంటుంది.

Latest Updates