15నిమిషాల్లో కరోనా టెస్ట్ లు..?

15నిమిషాల్లో కరోనా వైరస్ సోకిందా లేదా అని నిర్ధారించే దిశగా టాటా ఫండింగ్ సంస్థ ఈ25బయో తెలిపింది. అమెరికా మసాచుసెట్స్ కు చెందిన ఈ25బయో సంస్థ సైంటిస్ట్ లు  స్పీడ్ గా కరోనా వైరస్ టెస్ట్ చేసేందుకు  యాంటిజెన్ టెస్ట్ కిట్ ను డెవలప్ చేస్తున్నారు.

గతంలో డెంగ్యూ మరియు జికా కోసం రోగ నిర్ధారణ కిట్ లను తయారు చేసింది. MIT టాటా సెంటర్‌లో ప్రారంభమైన ఈ సంస్థకు టాటా ట్రస్ట్‌లు సపోర్ట్ చేస్తున్నాయి. ఇతర పద్ధతులతో పోలిస్తే చాలా తక్కువ సమయంలో కరోనా వైరస్ టెస్ట్ రిజల్ట్ వస్తాయని సైంటిస్ట్ లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ25బయో సభ్యులు మాట్లాడుతూ  కరోనా టెస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట తరహాలో ఉంటుందని, ముక్కు రంధ్రాల్ని పూర్తిగా శుభ్రం చేయాలని అన్నారు. లాలాజలం తో పాటు ప్రత్యామ్నాయ నమూనాల ద్వారా టెస్ట్ లు చేయోచ్చా లేదా అన్న అంశం గురించి తెలుసుకునేందుకు సైంటిస్ట్ లు ప్రయత్నిస్తున్నారని ఈ25బయో సీఈఓ ఇరేన్ బాష్ తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయిలో పరిశోధనలు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

Latest Updates