బిగ్‌బాస్కెట్‌ను కొనుగోలు చేసిన టాటా గ్రూప్

బిగ్‌బాస్కెట్‌ను కొనుగోలు చేసిన టాటా గ్రూప్

కూరగాయలు, కిరాణా వస్తులను ఆన్‌లైన్‌ ద్వారా ఇంటింటికి సరఫరా చేసే బిగ్‌బాస్కెట్‌ను… టాటా గ్రూప్‌ కొనుగోలు చేసింది. ఈ డీల్‌కు సంబంధించి  రెండు సంస్థ మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్కెట్‌ విలువ రూ. 13,500 కోట్లుగా లెక్క గట్టారు. ఇందులో టాటా గ్రూప్‌ రూ. 9,500 కోట్లు చెల్లించి 68 శాతం వాటాను కొనుగోలు చేసింది. చైనాకు చెందిన ఆలి బాబా, మరికొందరు ఇన్వెస్టర్లు ఈ డీల్‌ తర్వాత తప్పుకున్నారు. బిగ్‌ బాస్కెట్‌ ప్రమోటర్లలో ఒకరైన హరి మీనన్‌తో పాటు ఆయన బృందం మూడు నుంచి నాలుగేళ్ళ వరకు కంపెనీలో కొనసాగనుంది. బిగ్‌బాస్కెట్‌ను టేకోవర్‌ చేయడంతో… దీని ద్వారా తమ ఉత్పతులను కూడా టాటా గ్రూప్‌ అందించనుంది.