ఫారిన్ పార్టనర్ కావాలంటున్న టాటా మోటార్స్

న్యూఢిల్లీ: టాటా మోటార్స్ తన ప్యాసెంజర్ వెహికల్ బిజినెస్‌లోకి ఫారిన్ పార్టనర్‌‌‌ను ఆహ్వానించాలని చూస్తోంది. ఫారిన్ పార్టనర్‌‌‌‌ కోసం టాటా మోటార్స్‌‌ వెతకడం మొదలెట్టింది. రూ.9,417 కోట్లకు తమ యూనిట్‌‌ను ట్రాన్స్‌‌ఫర్ చేయాలని అనుకుంటోంది. యూరప్‌‌, ఈస్ట్ ఏషియాకు చెందిన పలు ఆటో కంపెనీలతో ఇందు కోసం టాటా గ్రూప్ చర్చలు జరుపుతోంది. తన ప్యాసెంజర్ వెహికల్ బిజినెస్‌లో 49 శాతం వాటాను మాత్రమే టాటా మోటార్స్ విక్రయించాలని అనుకుంటున్నట్టు ఓ ఇంగ్లీష్ వెబ్‌ సైట్ రిపోర్ట్ చేసింది.

 

 

Latest Updates