జీఎంఆర్ ఎయిర్ పోర్టులో టాటాకు వాటా

Tatas enter airports business, Sharing with GMR

ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడాలనుకుంటున్న జీఎంఆర్‌ గ్రూప్‌ కు ఎట్టకేలకు టాటా గ్రూప్‌ రూపంలో సరైన ఆధారం చిక్కింది. ఎయిర్‌ పోర్టుల రంగంలో ఎంట్రీ ఇవ్వాలని టాటా గ్రూప్‌ ఎప్పటి నుంచో చూస్తోంది. ఇక నిధుల కటకట నుంచి తొందరగా బయటకు రావాలని జీఎంఆర్‌ గ్రూప్‌ గత కొన్నేళ్లుగా అనేక ప్రయత్నాలు చేస్తోంది. జీఎంఆర్‌ ఎయిర్‌ పోర్టు బిజినెస్‌ లో టాటా గ్రూప్‌ పెట్టుబడులు పెడుతోంది. ఈ డీల్‌‌‌‌ ఇరు వర్గాలకూ ప్రయోజనకరంగా పరిణమించింది. టాటా గ్రూప్‌ సింగపూర్‌ సావరిన్‌‌‌‌ వెల్త్‌‌‌‌ఫండ్‌‌‌‌ జీఐసీ,ఎస్‌ ఎస్‌ జీ క్యాపిటల్‌‌‌‌లతో కలిసి రూ. 8,000 కోట్లను ఎయిర్‌ పోర్టుల వ్యాపారంలో పెట్టుబడిగా పెడుతున్నట్లు జీఎంఆర్‌ గ్రూప్‌ బుధవారం వెల్లడించింది. జీఎంఆర్‌ ఎయిర్‌ పోర్ట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌లో జీఎంఆర్‌ ఇన్‌‌‌‌ఫ్రా,ఇతర సబ్సిడియరీల ఈక్విటీ వాటా ఈ లావాదేవీ తర్వాత 54 శాతానికి పరిమితం కానుం ది. మరో రెండు శాతం వాటా జీఎంఆర్‌ ఎంప్లాయీ వెల్ఫేర్‌ ట్రస్ట్‌‌‌‌ చేతిలో ఉంటుంది. ఇక టాటా గ్రూప్‌ కు సుమారు 20 శాతం, జీఐసీకి 15 శాతం, ఎస్‌ ఎస్‌ జీకి 10 శాతం వాటా ఉంటాయి

ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలకు ఎగ్జిట్‌ !

జీఎంఆర్‌ ఎయిర్‌ పోర్ట్‌‌‌‌ లిమి టెడ్‌‌‌‌లో ఎప్పటి నుం చోవాటాదారులుగా ఉన్న ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలకూఎగ్జిట్‌ కల్పిం చాలని జీఎంఆర్‌ ఇన్‌‌‌‌ఫ్రా నిర్ణయించు-కుం ది. జీఎంఆర్‌ ఎయిర్‌ పోర్ట్‌‌‌‌ లిమి టెడ్‌‌‌‌లో ప్రైవేట్‌ఈక్విటీ సంస్థలకు 5.8 శాతం వాటా ఉంది. కొత్తఇన్వెస్టర్లు టాటా గ్రూప్‌ , జీఐసీ, ఎస్‌ ఎస్‌ జీలతోతాజా పెట్టుబడుల ప్రతిపాదనల ఒప్పం దం మీదసంతకాలు చేసి నట్లు జీఎంఆర్‌ గ్రూప్‌ ప్రకటించిం -ది. ఈ ఒప్పం దం ప్రకారం జీఎంఆర్‌ ఎయిర్‌ పోర్ట్‌‌‌‌ లిమి టెడ్‌‌‌‌ (జీఏఎల్‌‌‌‌)లో తాజా ఈక్విటీ రూపంలోరూ.1000 కోట్లను కొత్త ఇన్వెస్టర్లు పెడతారు.మిగిలి న రూ. 7,000 వేల కోట్లతో ప్రస్తుత ఇన్వెస్ట-ర్లు జీఎంఆర్‌ ఇన్‌‌‌‌ఫ్రా, దాని సబ్సిడి యరీల షేర్లనుకొత్త ఇన్వెస్టర్లు కొం టారు. ఎయిర్‌ పోర్టుల వ్యాపారనిర్వహణ మాత్రం జీఎంఆర్‌ చేతిలోనే కొనసాగ-నుం ది. జీఏఎల్‌‌‌‌ విలువను రూ. 18 వేల కోట్లుగాలెక్కకట్టారని, జీఏఎల్‌‌‌‌ బోర్డులో కొత్త ఇన్వెస్టర్లకుభాగస్వామ్యం ఉంటుం దని జీఎంఆర్‌ ప్రకటించింది. జీఏఎల్‌‌‌‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన టాటా గ్రూప్‌, జీఐసీ, ఎస్‌ ఎస్‌ జీలను స్వాగతిస్తున్నట్లు జీఎంఆర్‌ ఇన్‌‌‌‌ఫ్రా మేనేజింగ్‌‌‌‌ డైరెక్టర్‌ గ్రంధి కిరణ్‌ కుమార్‌ చెప్పా రు. దీర్ఘకాలిక దృక్పథం ఉన్న ఈ ఇన్వెస్టర్లను ఆయన కొనియాడారు. తాజా ఇన్వెస్టర్ల రాకతో ఎయిర్‌ పోర్టుల వాణిజ్యాన్ని మరింత చురుగ్గా విస్తరించడం సాధ్యపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకు నిలబడిన జీఎంఆర్‌ గ్రూప్‌ , దీర్ఘకాలిక పెట్టుబడుల సమీకరణలో భాగంగానే తాజా పెట్టుబడులను ఆహ్వానించినట్లు కిరణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. తాజాడీల్ తో ఈ ఆర్థిక సంవత్సరాంతానికి గ్రూప్​ కన్సాలిడేటెడ్ అప్పు రూ.12,000 కోట్లకు తగ్గుతుందని జీఎంఆర్​ ఆశాభావంతో ఉంది. ఇండియాలోని ఢిల్లీ, హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాలతోపాటు, విదేశాలలోని  మరికొన్ని ఎయిర్‌ పోర్టుల నిర్వహణా జీఎంఆర్‌ ఇన్‌‌‌‌ఫ్రా నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ లోని విశాఖపట్నం సమీపంలో భోగాపురం అంతర్జా తీయ విమానాశ్రయ నిర్మాణ ప్రాజెక్టునూ ఇటీవలే జీఎంఆర్‌ ఇన్‌‌‌‌ఫ్రా దక్కించుకుంది.

జీఎంఆర్‌ ఇన్‌ ఫ్రా డీమెర్జర్‌

కొత్త ప్రతిపాదనకు డాక్యుమెంటేషన్‌‌ పూర్తి కావాల్సి ఉందని, వివిధ రెగ్యులేటరీ అనుమతులు కూడా రావాల్సి ఉంటుందని జీఎంఆర్‌ గ్రూప్‌ వెల్లడించింది. ఈ లావాదేవీ తర్వాత ఎనర్జీ, హైవేస్‌ , అర్బన్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ , ట్రాన్స్‌‌పోర్ట్‌‌ బిజినెస్‌ లను దేనికది విడదీయాలనకుంటున్నట్లు కూడా జీఎంఆర్‌ గ్రూప్‌ స్పష్టం చేసింది. ఫలితంగా ఎయిర్‌ పోర్ట్‌‌ వ్యాపారం ప్రత్యేకంగా అవతరిస్తుందని పేర్కొంది. ఎయిర్‌ పోర్టుల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ఇన్వెస్టర్లు ఆసక్తిచూపిస్తుం డటంతో ఈ డీమెర్జర్‌ ను ప్రతిపాదిస్తున్నట్లు తెలిపింది.

Latest Updates