కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణ ప్రాజెక్ట్ ను ద‌క్కించుకున్న టాటా

కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణ ప్రాజెక్ట్ ను టాటా కంపెనీ ద‌క్కించింది. కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణానికి కేంద్ర‌ప్ర‌జాప‌నుల శాఖ బిడ్డింగ్ నిర్వ‌హించింది.

పోటీ పోటీగా జ‌రిగిన బిడ్డింగ్ లో ఎల్ అండ్ టీ మ‌రియు టాటా కంపెనీలు ఈ ప్రాజెక్ట్ ను ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నించాయి. కేంద్రం కొత్త‌గా నిర్మించే పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణానికి రూ.940 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నా వేసింది.

అంచ‌నా ప్ర‌కారం బిడ్డింగ్ వేయ‌గా టాటా ప్రాజెక్ట్ రూ.861కోట్లకు, ఎల్ అండ్ టీ రూ.865కోట్ల‌కే పార్ల‌మెంట్ ను నిర్మిస్తామ‌ని చెప్పాయి. దీంతో కేంద్రం త‌క్కువ వ్య‌యంతో పార్ల‌మెంట్ ను నిర్మించేందుకు ముందుకు వ‌చ్చిన టాటా కంపెనీకి ఈ ప్రాజెక్ట్ ను క‌ట్ట‌బెట్టింది.

Latest Updates