ఈ ఆదాయాలపై పన్ను లేదు

కొత్త పన్ను విధానంలో 70 మినహాయింపులు రద్దు చేస్తున్నట్టు ఇటీవలి బడ్జెట్‌‌ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికీ కొన్ని ఆదాయాలకు మినహాయింపు ఉంది. అవేంటో చూద్దాం

తాజా బడ్జెట్‌‌ సెక్షన్‌‌ 80సి కింద వర్తించేవి సహా చాలా పన్ను మినహాయింపులను రద్దు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పన్నుల విధానా న్ని ఎంచుకునే వాళ్లకు మినహాయింపులు ఉండవు. అంటే, తక్కువ పన్నురేటు ఎంచుకుంటే మినహాయింపు వదులుకోవాలి. ఎక్కువ పన్ను బ్రాకెట్లో ఉండాలనుకుంటే ఇవి కొనసాగుతాయి. అయినప్పటికీ రెండు విధానాల్లో ఇప్పటికీ కొన్ని ఆదాయాల విషయంలో మునుపటిలాగే రిబేట్లు పొందవచ్చు.

ఐటీ చట్టం సెక్షన్‌‌ 10(15)(ఐ) ప్రకారం పోస్టా ఫీసు సేవింగ్స్‌‌ ఖాతా నుంచి వచ్చిన వడ్డీ ఆదా యంలో కొంత వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తు లు అయితే రూ.3,500 వరకు, జాయింట్‌‌ అ కౌంట్ హోల్డర్లు అయితే రూ.7,500 వరకు ప న్ను మినహాయింపును ఉపయోగించుకోవచ్చు.

ఒక ఉద్యోగి ఐదేళ్ల కంటే ఎక్కువ పనిచేస్తే యజమాని గ్రాట్యుటీ చెల్లిస్తాడు. ఐటీ చట్టం ప్రకారంఉద్యోగి జీవితకాలంలో రూ.20 లక్షల వరకు మినహాయింపు తీసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఎంతమొత్తానికి అయినా మినహాయింపు ఉంటుంది.

కొత్త పన్ను విధానంలో సెక్షన్‌‌ 80–సి కింద బీమా ప్రీమియాలకు మినహాయింపులను రద్దు చేసినా పాలసీ మెచ్యూరిటీ అయిన తర్వాత చేతికి అందిన మొత్తంపై పన్ను ఉండదు.

ఉద్యోగి ఈపీఎఫ్/ఎన్‌‌పీఎస్‌‌ ఖాతాకు నెలానెలా యజమాని చెల్లించే చందాకు పన్ను వర్తించదు. అయితే ఈ మొత్తం ఒక ఏడాదిలో రూ.7.5 లక్షలు మించకూడదు. సూపర్‌‌యాన్యుయేషన్ ఖాతాకూ మినహాయింపులు వర్తిస్తాయి.

ఎంప్లాయీ ప్రావిడెంట్‌‌ ఫండ్‌‌ (ఈపీఎఫ్‌‌) ఖాతా నుంచి అందిన ఆదాయానికి  మినహాయింపు ఉంటుంది. వడ్డీ 9.5 శాతం దాటకూడదు. కొత్త పన్ను విధానంలో పబ్లిక్‌‌ ప్రావిడెంట్‌‌ ఫండ్‌‌ (పీపీఎఫ్‌‌) చందాకు పన్ను మినహాయింపును తొలగించారు. ఈ ఖాతా నుంచి వచ్చిన వడ్డీకి, మెచ్యూరిటీ మొత్తానికి పన్ను ఉండదు.

తమ కూతురి కోసం సుకన్య సమృద్ధి యోజనలో పొదుపు చేసే మొత్తానికి కొత్త పన్ను విధానంలో మినహాయింపు ఉంది. దీని మెచ్యూరిటీ మొత్తం కూడా పన్ను పరిధిలోకి రాదు.

నేషనల్ పెన్షన్‌‌ స్కీమ్‌‌ అకౌంట్‌‌ మెచ్యూర్‌‌ అయ్యాక వచ్చే మొత్తానికీ పన్ను పోటు ఉండ దు. సంచిత నిధిలోని 60 శాతం మొత్తానికి మినహాయింపు ఉంటుంది. మిగతా 40 శాతాన్ని ఆన్యుటీ ప్లాన్ల కొనుగోలుకు వెచ్చించాలి.

యజమాని నుంచి ఉద్యోగికి అందే పలు సదుపాయాలపై మినహాయింపులను కొత్త విధానంలో తొలగించారు. ఉద్యోగికి యజమాని ఇచ్చిన బహుమతిపై మాత్రం పన్ను ఉండదు.

యజమాని ఉద్యోగులకు అందించే ఫుడ్‌‌, బే వరేజ్ కూపన్లకు పన్ను వేయకుండా ఐటీ చట్టంలోని మూడో రూల్‌‌ను మార్చాలని ఈ బడ్జె ట్‌‌ ప్రపోజ్‌‌ చేసింది. ఈ విషయం ఫైనాన్స్‌‌ బిల్లులో లేదు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

స్వచ్ఛందంగా ఉద్యోగాన్ని వదులుకున్నందుకు అందిన మొత్తంపైనా కొత్త విధానంలోనూ పన్ను ఉండదు. కొత్త, పాత విధానాల్లో రూ.ఐదు లక్షల వరకు మినహాయింపు ఇస్తారు. ప్రభుత్వేతర ఉద్యోగులు రిటైర్‌‌మెంట్‌‌ సమయంలో వాడుకోని సెలవులను నగదుగా మార్చుకుంటే, రూ.మూడు లక్షల వరకు ఉన్న మొత్తంపై పన్ను ఉండదు.

Latest Updates