ఖరీదైన కారుకు… అంతే భారీగా ఫైన్

వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని లేదంటే జరిమానాతో పాటు శిక్షలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచరికలు జారీ చేస్తున్నారు. అయినా కొందరు ఏం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. దీంతో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు రూల్స్ బ్రేక్ చేస్తున్న వాహనదారులకు భారీగా ఫైన్ విధిస్తున్నారు.

అహ్మదాబాద్ లో వాహనాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు నంబర్ ప్లేట్, సరైన సర్టిఫికెట్లు లేకుండా ఉన్న అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కారు ఫోర్షే పట్టుపడింది. దీంతో పోలీసులు ఆ వాహనదారుడికి రూ. 9.80 లక్షల జరిమానా విధించారు.  ఈ కారు ఖరీదు దాదాపు 2 కోట్ల రూపాయలు.

ఈ ఘటన గతేడాది నవంబర్ లో జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన ఆరు వారాల తర్వాత ఈ ఫెనాల్టీ విషయంలో పోలీసులు మళ్లీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ ఫైన్‌ను గుజరాత్ ఆర్టీవో లేటెస్ట్ గా రూ.27.68 లక్షలకు పెంచారు.

జనవరి 7, 2020 నుంచి 2033 ఆగష్టు 28 వరకు మోటార్ బ్యాలెన్స్ ట్యాక్స్ రూపంలో మోటార్ వెహికిల్ ట్యాక్స్ రూ.16 లక్షలు. దానిపై వడ్డీ రూ.7.68 లక్షలు విధించారు. పెనాల్టీ ఫీజు రూపంలో మరో రూ.4 లక్షలు.. మొత్తం కలుపుకొని రూ.27.68 లక్షలు ట్రాఫిక్ పోలీసులకు చెల్లించాల్సి  ఉంటుంది.

Latest Updates