హైదరాబాద్ లో కలకలం : లిఫ్ట్ ఇచ్చి యువతిని రేప్ చేసిన క్యాబ్ డ్రైవర్

హైదరాబాద్ లో దారుణం జరిగింది. క్యాబ్ లో లిఫ్ట్ ఇస్తానంటూ క్యాబ్ డ్రైవర్ యువతిని రేప్ చేశాడు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా చందన వెల్లికి చెందిన క్యాబ్ డ్రైవర్ ( 32) అదే గ్రామానికి చెందిన ఓ యువతిని అత్యాచారం చేశాడు.   బాధితురాలు హయతాబాద్ గ్రామంలో సిమ్ కొనుగోలు చేసేందుకు వెళ్లింది. అదే సమయంలో క్యాబ్ డ్రైవర్ మొబైల్ షాప్ లో చార్జింగ్ పెట్టుకుంటున్నాడు.

యువతి సిమ్ కొనేందుకు షాప్ వద్దకు రావడంతో ఆమెతో క్యాబ్ డ్రైవర్  మాటమాట కలిపాడు. నేను ఇంటికే వెళుతున్నా. నా క్యాబ్ ఎక్కు మీ ఇంటి దగ్గర దించేస్తా..? అంటూ నమ్మించాడు. డ్రైవర్ మాటల్ని నమ్మిన బాధితురాలు అతని వెంట వెళ్లింది. మరో మూడు కిలోమీటర్ల దూరంలో యువతి ఇల్లు వస్తుందని ఊహించిన నిందితుడు దారి మళ్లించి నిర్జీవ ప్రదేశంలోకి తీసుకెళ్లాడు. బలవంతంగా ఆమెను రేప్ చేశాడు. బాధితురాలు ప్రతిగడించడంతో పలుమార్లు దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలు ఆ షాక్ నుంచి కోలుకోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Latest Updates