ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తీర్పును ఖండిస్తున్నాం

ఎస్సీ,ఎస్టీ చట్టంపై సుప్రీం వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండిస్తుందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ హక్కు కాదని సుప్రీం ఇచ్చిన తీర్పుపై  దళిత గిరిజన, మైనార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయన్నారు.  దళిత గిరిజన వర్గాలకు భరోసా కల్పించడానికే  ఇందిరా పార్కు దగ్గర నిరసన ధర్నా చేపట్టినట్లు చెప్పారు.  రిజర్వేషన్లు కొనసాగించాలని కాంగ్రెస్ కోరుకుంటుందన్నారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతమే సామాజిక న్యాయమన్నారు.  ముస్లిం రిజర్వేషన్, గిరిజన సమస్యలపై టిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఒక్కరోజు కూడా మాట్లాడలేదన్నారు. గిరిజన రిజర్వేషన్ ను 10 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు.

 

Latest Updates