ఎలక్షన్ ఫండ్ కు టీసీఎస్ రూ.220 కోట్లు విరాళం

 

ఎలక్షన్ ఫండ్ కు టీసీఎస్ రూ.220 కోట్ల భారీ విరాళ మిచ్చింది. కంపెనీ చరిత్రలో ఎలక్టోరల్ ట్రస్ట్ కు ఇంత పెద్ద మొత్తం కేటాయించడం ఇదే మొదటిసారని కంపెనీ వర్గాలు తెలిపాయి. కంపెనీ లాభనష్టాల ఖాతాలో ఇతర ఖర్చుల పద్దు కింద చూపించిన ఈమొత్తం ఏ పార్టీ అకౌంట్ లో పడిందనే విషయం మాత్రం తెలియరాలేదు. కార్పొరేట్ కంపెనీలకు,రాజకీయ పార్టీలకు మధ్య అనుసంధానంగా వ్యవహరించే ఎ లక్టోరల్ ట్రస్ట్ లు వివిధ కంపెనీల నుంచి విరాళాలు సేకరిస్తాయి. ఈ మొత్తాన్ని ట్రస్ట్ రూల్స్ కు అనుగుణంగా దేశంలోని వివిధ పార్టీలకు పంచుతాయి. ఏ పార్టీకి ఎంతనే విషయంలో దాతల సూచనలతో పాటు ట్రస్ట్ సభ్యుల నిర్ణయమూ కీలకమే.దేశంలోని పలు ట్రస్టులలో ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ పెద్దది. ఈ ట్రస్ట్ కు అన్ని కార్పొరేట్ కంపెనీల నుంచి విరాళాలు అందుతుంటాయి. అందులో భారతీగ్రూప్, డీఎల్ఎఫ్ పెద్ద మొత్తంలో అందించాయి.వీటితో పాటు ఇతర కంపెనీల నుంచి సేకరించిన మొత్తంలో మెజారిటీ వాటాను బీజేపీకి కేటాయిస్తూ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. 2017–18 ఆర్థికసంవత్సరంలో మొత్తం రూ.169 కోట్లు అందగా,అందులో రూ.144 కోట్లను బీజేపీకి అందించిందని తాజా వార్షిక నివేదిక వెల్లడించింది. టాటా గ్రూపు కంపెనీలు ఎలక్టోరల్ ట్రస్ట్ లకు విరాళమివ్వడం మామూలే.. గతంలో టీసీఎస్ ప్రోగ్రెసివ్​ ఎలక్టోరల్ ట్రస్ట్ కు విరాళమిచ్చేది. ఇలా అందుకున్న విరాళాన్ని ట్రస్ట్ పలు రాజకీయ పార్టీలకు పంచుతుంది. 2013–16 మధ్య కాలంలో కాంగ్రెస్ తో పాటు బీజేడీ తదితర పార్టీలకు విరాళాలను కేటాయించింది.

 

Latest Updates