లక్షన్నర పోస్టాఫీసులు డిజిటల్ : టీసీఎస్

ఎంటర్ ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ) సొల్యూషన్స్ ద్వారా దేశవ్యాప్తంగా లక్షా 50 వేల పోస్టాఫీసులను ఇంటిగ్రేట్‌ చేసినట్లు అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌‌‌‌ తెలిపింది. బిజినెస్‌‌‌‌ మేనేజ్‌ మెంట్‌ సాఫ్ట్‌‌‌‌వేర్‌ అయిన ఈఆర్‌ పీని ఉపయోగించడం వల్ల కంపెనీ, టెక్నాలజీ, సర్వీసులను ఆటోమేట్‌ చేయవచ్చు. అంటే ఎక్కు వగా మానవ వనరుల అవసరం లేకుండా మరింత సులువుగా పనులు చేయవచ్చు.పోస్టాఫీసుల ఆధునీకరణ కోసం పోస్టల్‌ శాఖ నుంచి రూ.1,100 కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కిందని టీసీఎస్‌‌‌‌ 2013లోనే ప్రకటించింది. ఫలితంగా పోస్టాఫీసుల్లోని కంప్యూటర్లకు అత్యాధునిక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. ఈఆర్‌పీ వల్ల మెయిల్‌ ఆపరేషన్స్‌‌‌‌, ఫైనాన్స్‌‌‌‌, అకౌంటింగ్‌ , హెచ్‌ ఆర్‌ పనులు మరింత సులువు అవుతాయి. అన్ని పోస్టా ఫీసులను ఒకే నెట్‌ వర్క్‌‌‌‌ కిందికి తీసుకొచ్చారు. ఫలితంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఈ పోస్టల్‌ నెట్‌ వర్క్‌‌‌‌ అవుతుందని టీసీఎస్ తెలిపింది.

పోస్టా ఫీసుల్లో పని చేసేఐదు లక్షల మంది ఉద్యోగులకు, కస్టమర్లకు ఈఆర్‌ పీసాఫ్ట్‌‌‌‌వేర్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటుందని పేర్కొంది. అంతేగాక ఇప్పటికే 24 వేల పోస్టా ఫీసుల్లో 80 వేల పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌‌‌‌ టెర్మినల్స్‌‌‌‌ను ఏర్పాటుచేసింది. కన్‌ సైన్‌ మెంట్‌ ట్రాకింగ్‌ సదుపాయం ఉన్నవెబ్‌ పోర్టల్‌ నూ అభివృద్ధి చేసింది. కస్టమర్లకు సేవలు అందించడానికి వివిధ భాషల కాల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పోస్ట్‌‌‌‌మ్యాన్‌ లు ప్రజల ఇళ్లకు వెళ్లి పోస్టల్‌ , బ్యాంకింగ్‌ , ఇన్సూరెన్స్‌‌‌‌, క్యాష్‌ మేనేజ్‌ మెంట్‌ సేవలు అందిం చడానికి దర్పణ్‌ హాండ్‌ హెల్డ్‌‌‌‌ డివైసెస్‌‌‌‌  ఇచ్చారు. దేశంలోని మారు మూల ప్రాంతాలలోని డిజిటల్‌ కాలానికి తగినట్లు గా తమ సేవలను మలుచుకునేందుకు వివిధ దేశాలలోని పోస్టల్‌ డిపార్ట్‌‌‌‌మెంట్ లు ప్రయత్నిస్తున్నాయని టీసీఎస్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ గ్రూప్‌ హెడ్‌ (పబ్లిక్‌ సర్వీసెస్‌‌‌‌)దేబాషిశ్‌ ఘోష్‌ తెలిపా రు. ఇండియాలో పోస్టల్‌ సేవలడిజిటలైజేషన్‌ ప్రాజెక్టులో తమకు భాగం దొరకడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు.

 

Latest Updates