టీసీఎస్‌‌ మళ్లీ టాప్‌‌ ప్లేస్‌‌కి

న్యూఢిల్లీ : మార్కెట్‌‌ కాపిటలైజేషన్‌‌లో టెక్నాలజీ దిగ్గజం  టీసీఎస్‌‌ మరోసారి రిలయన్స్‌‌ను ఓవర్‌‌టేక్‌‌ చేసింది. సోమవారం ట్రేడింగ్‌‌ ముగిసే సరికి టీసీఎస్‌‌ మార్కెట్‌‌ కాపిటలైజేషన్‌‌ రూ. 8,37,194 కోట్లకు చేరింది. ఇది రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ మార్కెట్‌‌ కాపిటలైజేషన్‌‌ రూ. 8,36,024 కోట్ల కంటే 1,170 కోట్లు ఎక్కువ. టీసీఎస్‌‌ షేర్లు సోమవారం బీఎస్‌‌ఈలో 2.39 శాతం పెరిగి రూ. 2,231 కి చేరగా, ఆర్‌‌ఐఎల్‌‌ షేర్లు ఫ్లాట్‌‌గా రూ. 1,319 వద్ద ముగిశాయి. కిందటి నెలలోనే టీసీఎస్‌‌ను అధిగమించి రిలయన్స్‌‌ ముందుకొచ్చింది. మార్కెట్‌‌ కాపిటలైజేషన్ విషయంలో ఈ రెండు కంపెనీల మధ్య పోటీ సాధారణమైపోయింది. దేశీయంగా స్టాక్‌‌ మార్కెట్‌‌ కాపిటలైజేషన్‌‌లో టీసీఎస్‌‌, ఆర్‌‌ఐఎల్‌‌ తర్వాత హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌ రూ. 6,66,533 కోట్లు, హెచ్‌‌యూఎల్‌‌ రూ. 4,00,325 కోట్లు, హెచ్‌‌డీఎఫ్‌‌సీ రూ.3,78,236 కోట్లు ఉన్నాయి.

Latest Updates