అసెంబ్లీ వద్ద ఉల్లిగడ్డలతో చంద్రబాబు నిరసన

ఉల్లి బంగారంతో సమానంగా ఉందన్నారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు..ఉల్లిగడ్డ ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉల్లి కిలో రూ.200 ఉందంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.  ధరలు నియంత్రించే వరకు టీడీపీ పోరాటం ఆగదన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. ఉల్లి ధరలకు నిరసనగా పార్టీ నేతలతో కలిసి అసెంబ్లీ వద్ద నిరసన తెలిపారు.  ఉల్లి గడ్డలు మెడలో వేసుకుని  నిరసన తెలిపారు. తక్కెడలో ఉల్లి ,బంగారం వేసి రెండూ సమానమని చెప్పారు.

Latest Updates