మాజీ ఎంపీ శివప్రసాద్ మృతిపట్ల చంద్రబాబు సంతాపం

టీడీపీ లీడర్, చిత్తూరు మాజీ ఎంపీ నరమల్లి శివప్రసాద్ మృతి పట్ల టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సంతాపాన్ని ప్రకటించారు. హైదరాబాద్ లోని టీడీపీ ఆఫీస్ లో మాట్లాడిన ఆయన.. శివప్రసాద్ తన క్లాస్ మేట్ అని చెప్పారు. నిన్ననే హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించానని అన్నారు. డాక్టర్లు అన్ని విధాలుగా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారని.. అంతలోనే కాలం చేయడం బాధాకరమని అన్నారు చంద్రబాబు.

తన ఆహ్వానంతోనే సినిమాల్లో ఉంటూ రాజకీయాల్లోకి శివప్రసాద్ వచ్చారని అన్నారు చంద్రబాబు. ఎంపీగా, మంత్రిగా రాణించారని, వారి భార్యకూడా ఆయనకు మద్దతునిచ్చారని అన్నారు. శివప్రసాద్ పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయమని విధిని ఎవరూ కాదనలేమని అన్నారు. శివప్రసాద్ స్పూర్తితో కార్యకర్తలందరూ ప్రజాసేవకు అంకితమవ్వాలన్నారు చంద్రబాబు.

Latest Updates