లోక్ సభలో కలిసివచ్చే పార్టీలతో పొత్తు : టీడీపీ

అమరావతి : లోక్ సభ ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళతామన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల తర్వాత పార్టీ సభ్యత్వాలు ప్రారంభిస్తామని చెప్పారు. అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్ బ్యూరో సమావేశానికి నేతలు హాజరయ్యారు. గతంలో తెలంగాణలో 8 లక్షల సభ్యత్వాలు చేయించామన్నారు రావుల.

ఏపీలో రేపు ఆదివారం నుంచే ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు మంత్రి కాలువ శ్రీనివాసులు. పనితీరు, సమర్ధత ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు కాలువ.

Latest Updates