ఇందిరాగాంధీకి పట్టినగతే జగన్ కు వస్తుంది : టీడీపీ మాజీ మేయర్

కర్నూల్ : వరద బాధితులను వెంటనే ఆదుకోవాలి.. పేదలకు ఆహారం అందించాలంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర అర్ధనగ్న ప్రదక్షిణలు చేశారు కర్నూల్ మాజీ మేయర్ బంగి అనంతయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం జగన్ వైఖరి రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించిన చందంగా ఉందని ఆరోపించారు. ఎన్నికల ముందు వాగ్దానాలు కోటలు దాటాయని.. అధికారంలోకి వచ్చాక గడప దాటడం లేదన్నారు.

ఇదే తీరును కొనసాగిస్తే ఏడాది తర్వాత జగన్ కు జనతా ప్రభుత్వం, ఇందిరాగాంధీలకు పట్టిన గతే వస్తుందన్నారు బంగి. జగన్ ను ఎందుకు గెలిపించుకున్నామ అని జనం బాధపడుతున్నారని..ప్రభుత్వానికి కనువిప్పు కలగాలంటూ చెప్పుతో కొట్టుకుని నిరసన తెలియజేశారు బంగి అనంతయ్య. వరద బాధితులను తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరదలు వచ్చి జనం అల్లాడుతుంటే సీఎం జగన్ అమెరికా యాత్ర చేస్తున్నారని సీరియస్ అయ్యారు అనంతయ్య.

Latest Updates