ప్రాణాలతో బయటపడతాం అనుకోలేదు

గుంటూరు: మాచర్లలో వైసీపీ కార్యకర్తలు తమపై కర్రలతో దాడులకు పాల్పడ్డారని  టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు దాడి జరిగిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాచర్ల ఘటనపై పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లామని, తమ వాహనాలపై వైసీపీ నేతలు కర్రలతో దాడి చేశారన్నారు. వాహనాలతో పాటు పోలీసు వాహనాలపై కూడా దాడి చేశారన్నారు. కర్రలతో నన్ను, మా అడ్వొకేట్‌ను కొట్టారని ఆరోపించారు బోండా. వారి దాడిలో తమకు గాయాలయ్యాయని,  రక్తం కూడా కారుతోందన్నారు. డీఎస్పీపై కూడా దాడి చేశారన్న బోండా ఉమ.. పోలీసు రక్షణ ఉన్నా తమపై దాడి జరిగిందన్నారు. వైసీపీ కార్యకర్తల దాడి నుంచి ప్రాణాలతో బయటపడతామనుకోలేదని బోండా ఉమా అన్నారు.

Latest Updates