బీజేపీలో చేరిన టీడీపీ, జనసేన నేతలు

గుంటూరు: టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు నేతలు నేడు బీజేపీలో చేరారు. జిల్లాలోని గురజాల , మాచర్ల నియోజకవర్గాలకు చెందిన మండల, గ్రామ స్థాయి నేతలు బీజేపీ నేత  ఏపూరి రామయ్య నేతృత్వంలో ఆ పార్టీలోకి చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ వారికి కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వనించారు.

ఇందులో భాగంగా కన్నా మాట్లాడుతూ.. దేశమంతా అభివృద్ధిని కాంక్షిస్తూ మోడీకి పట్టం కట్టారన్నారు. ఎవ్వరి  అంచనాలకు అందకుండా 300 పైగా స్దానాల్లో బీజేపిని గెలిపించారన్నారు. “ 2014 లో రాష్ట్ర విభజన ఆగదని తెలిసి ప్రజలను మభ్యపెట్టారు. నేడు హోదా విషయం లో కూడా ప్రజలను మభ్య పెడుతున్నారు. వైసిపి  ట్రాప్ లో పడవద్దని బాబుకి చెప్పాం. ఏపిలో బాబుతో పొత్తు పెట్టుకోని బీజేపీ బాగా నష్ట పోయింది. బాబు మనతో లేకపోయినా ఏపి ప్రజలు మనకు ముఖ్యమని మోడీ అండగా నిలిచారు. కేంద్రం నుంచి అన్ని విదాలుగా బాబు లబ్ది పొంది బీజేపీ పై బాబు దుష్పప్రచారం చేశారు. టీడీపీ నుంచి బీజేపిలో చేరేందుకు ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారని” కన్నా లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా అన్నారు.

Latest Updates