మాజీమంత్రి అచ్చెన్నాయుడు కారు యాక్సిడెంట్

ఏపీ మాజీ  మంత్రి  అచ్చెన్నాయుడికి  కొద్దిలో ప్రమాదం తప్పింది. విశాఖ జిల్లా  నక్కపల్లి  దగ్గర  ఎదురుగా వస్తోన్న  వాహనాన్ని తప్పించబోయి  ఆయన  కారు  డివైడర్ ను  ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అచ్చెన్నాయుడి  చేతికి  గాయాలయ్యాయి. ఆయనకు  నక్కపల్లి  హాస్పిటల్ లో  ప్రథమ చికిత్స అందించారు. గుంటూరులోని  ఎన్టీఆర్ భవన్ లో  మీడియా సమావేశంలో  పాల్గొని  శ్రీకాకుళం వెళ్తుండగా  ఈ ఘటన జరిగినట్లు  తెలుస్తోంది.

Latest Updates