ప్రభుత్వానికి కనీస అవగాహాన లేదు: బాబు ట్వీట్స్

ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని మండి పడ్డారు ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, టీడీపీ నాయకుడు చంద్రబాబు. తక్కువ ధరకు విద్యుత్ కొనడం మానేసి దుబారా కు పాల్పడుతుందంటూ జగన్ పాలనపై సోషల్ మీడియాలో ట్వీట్స్ చేశారు.

“పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పిపిఏ)పై దుష్ప్రచారం చేసి సోలార్, విండ్ పవర్ యూనిట్ ధర రూ.3 నుంచి రూ.4.84కే వస్తుంటే, శ్రద్ధ పెట్టకుండా ఇప్పుడు రూ.11.68కు విద్యుత్ కొనడం దుర్మార్గపు చర్య కాదా? మహానది కోల్ మైన్స్ లో టన్ను ధర రూ.1600 ఉంటే, సింగరేణిలో రూ.3,700కు కొనడాన్ని ఏమనాలి?” అంటూ చంద్రబాబు మండిపడ్డారు.

“ముందు జాగ్రత్త చర్యగా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని కనీస అవగాహన లేదు. ప్రత్యామ్నాయం చూడకుండా విద్యుత్ కొరతతో గ్రామాలను, ప్రజలను అంధకారంలోకి నెట్టి, రాష్ట్రానికి ఆర్ధిక భారం కలిగించడాన్ని ఏవిధంగా అర్ధం చేసుకోవాలి ? ఇప్పటికైనా ప్రభుత్వం వీటి మీద దృష్టి పెడితే మంచిదని” ఏపీ ప్రభుత్వానికి సూచించారు చంద్రబాబు.

tdp leader chandrababu naidu tweets on YCP Govt.

Latest Updates