తాడిపత్రిలో టీడీపీ,వైసీపీ వర్గాల దాడి..ఒకరు మృతి

అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్  హింసాత్మకంగా మారింది. తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త చింతా భాస్కర్ రెడ్డి మృతి చెందాడు. వైసీపీకి చెందిన సూర్యనారాయణ రెడ్డి, పుల్లారెడ్డి, సునీల్ కు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం వారిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు.

Latest Updates