టీడీపీకి మాజీమంత్రి డొక్క రాజీనామా

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ ఆపార్టీకి రాజీనామా చేశారు. ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆయన ఇవాళ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామాకు గల  కారణాలను వివరిస్తూ అధినేత చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. 2019 లో తాడికొండ సీటు ఇస్తారని ఆశిస్తే.. ఓడిపోతానని తెలిసి కూడా ప్రత్తిపాడు నియోజకవర్గం సీటు కేటాయించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై సోషల్ మీడియాలో టీడీపీ నేతల విమర్శలు బాధకల్గించాయన్నారు. మండలి సమావేశాలకు ముందు వైసీపీ వైపు మొగ్గు చూపినా వైసీపీ నాయకత్వంతో ఎటువంటి చర్చలు జరపలేదన్నారు.

see more news

బండారు దత్తాత్రేయకు అస్వస్థత..

రూ.100కే రెండు కోళ్లు

మారుతీరావు పోస్టుమార్టం రిపోర్టులో ఆసక్తికర విషయాలు

Latest Updates