భార్యను చూడటానికి వెళ్తుండగా పట్టుకున్న పోలీసులు

ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ లీడర్ చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతం వీడిన వెంటనే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. చింతమనేని భార్య అనారోగ్యంతో.. హస్పిటల్ లో ఉండటంతో.. ఆయన అజ్ఞాతం నుంచి బయటికి వచ్చారు. 12 రోజుల క్రితం కులం పేరుతో తిట్టారని కొందరు దళితులు చింతమనేనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై  కేసును నమోదు చేశారు పోలీసులు. అప్పటినుంచి చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్లారు.

చింతమనేని తన సొంత ఊరైన దుగ్గిరాలకు చేరుకుని.. అక్కడి నుంచి వారి  భార్యను చూడటానికి హాస్పిటల్ వెళ్లే క్రమంలో పోలీసులు చింతమనేనిని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ నాయకులకు పోలీసులకు మద్య తోపులాట జరిగింది.

Latest Updates