ఆర్జీవీ సైకో డైరెక్టర్ : యామిని

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విజయవాడలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రిలీజ్‌కు ముందు ప్రెస్‌‌మీట్ పెట్టడానికి యత్నించిన ఆర్జీవీని అడ్డగించి బలవంతంగా హైదరాబాద్‌ ఫ్లైట్‌ ఎక్కించి పంపిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంపై యామిని మాట్లాడుతూ.. ఆర్జీవీ సైకో డైరెక్టర్ అని వ్యాఖ్యానించారు. అలాంటి సైకోకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాగా.. ఆర్జీవీ మద్దతు పలుకుతూ వైఎస్ జగన్ ట్వీట్ చేసిన విషయం విదితమే. తనపై ఎవరైనా విమర్శలు చేస్తే అదే రీతిలో ప్రతి విమర్శలు చేసే వర్మ.. అయితే యామిని వ్యాఖ్యలపై ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే. మే-01న లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని ఏపీలో విడుదల చేస్తున్నామని చిత్రం యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

 

Latest Updates