టీడీపీ నేతల దాడిలో వైసీపీ కార్యకర్త మృతి

TDP leaders attack on YCP Supporter in Chittoor District

ఎన్నికల వేళ ఏపీలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రాయలసీమలోని రెండు జిల్లాల్లో రెండు పార్టీలకు చెందిన నేతలు మరణించడం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఉదయం అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలం మీరాపురంలో టీడీపి, వైసీపీ  వర్గీయుల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో   తీవ్రంగా గాయపడ్డ టీడీపీ నేత చింతా భాస్కర్‌రెడ్డి.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.

మరో జిల్లా చిత్తూరులో కూడా ఇరు పార్టీలకు చెందిన నేతలు ఘర్షణకు దిగారు. జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండలంలో టీడీపీ నేతలు చేసిన దాడిలో వెంకట్రాయపరెడ్డి అనే వైసీపీ కార్యకర్త మృతి చెందాడు. టీడీపీ వర్గీయులు విచక్షణారహితంగా దాడి చేయడం అతను వల్లే మరణించాడని వెంకట్రాయపరెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Updates