చంద్రబాబు ముందే తన్నుకున్నతెలుగు తమ్ముళ్లు

చంద్రబాబు ముందే టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుపై  దాడికి యత్నించాడు కేడీసీసీ మాజీ ఛైర్మన్ మల్లిఖార్జున్ రెడ్డి.  చంద్రబాబు స్టేజి పైకి వచ్చాక చాలా మంది నేతలు సన్మానించేందుకు స్టేజి పైకి వెళ్లారు. దీంతో సిబ్బంది వారందరినీ రానివ్వకుండా అడ్డుకున్నారు. అయితే పార్టీలో ముఖ్య నేతలమైన తమను స్టేజి పైకి ఎందుకు రానివ్వరంటూ వెంకటేశ్వర్లుపై ఆగ్రహాం వ్యక్త చేశాడు మల్లికార్జున్ రెడ్డి . దీంతో ఒకరినొకరు బాహాబాహీకి దిగారు.  అక్కడే  స్టేజ్ పైన ఉన్న చంద్రబాబు  మల్లికార్జున్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవ పడొద్దని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు.

Latest Updates