తండ్రి రూ. 125  పెంచితే, కొడుకు రూ. 250 పెంచారు

అమరావతి : పెన్షన్లు, ప్రభుత్వ  పథకాలపై  AP అసెంబ్లీలో  టీడీపీ, వైసీపీల  మధ్య వాగ్వాదం జరిగింది. YCP అధికారంలోకి  వస్తే  3 వేల పెన్షన్  ఇస్తామన్నారు. అది ఏమైందని ప్రశ్నించారు  టీడీపీ ఎమ్మెల్యే  రామానాయుడు. తండ్రి 125  రూపాయలు  పెంచితే, కొడుకు  250   రూపాయలు  పెన్షన్  పెంచాడని  చెప్పారు. రామానాయుడు  చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం  వ్యక్తం చేశారు  సీఎం జగన్. పథకాల  విషయంలో  టీడీపీ ఎమ్మెల్యేలు  ప్రజలను  తప్పుదోవ పట్టించే  ప్రయత్నం  చేస్తున్నారనీ…. రామానాయుడుకు మాట్లాడే  అర్హత లేదని  చెప్పారు. ఆయనపై  సభాహక్కుల  ఉల్లంఘన తీర్మానం  కోరుతున్నామన్నారు  జగన్. స్పీకర్  తమ్మినేని సీతారాం  ప్రివిలేజ్ మోషన్ ను కమిటీకి  రిఫర్ చేస్తున్నట్టు  చెప్పారు.

 

Latest Updates