ప్రజావేదిక కూల్చివేతపై స్పందించిన కేశినేని నాని

ప్రజావేదికను కూల్చివేయాలని సీఎం చేసిన జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కేశినేని నాని స్పందించారు.  ఆ వేదికకు ప్రత్యామ్నాయ ఏర్పాటుగా తమ కోసం మరో వేదికను నిర్మించి ఆ తర్వాత ప్రజావేదికను తొలగిస్తే బావుంటుందని ఫేస్ బుక్ ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కూల్చివేసే ముందు తమతో ఓ సారి సమావేశం నిర్వహించాలని కోరారు.

అంతే కాకుండా ఇప్పటికిప్పుడు ప్రజావేదికను తొలగించడం వల్ల ప్రభుత్వానికి రెండు రకాలుగా నష్టం కలుగుతుందని చెప్పారు. ఆ వేదికను ప్రజాధనంతో నిర్మించారు కాబట్టి, అది కూల్చేస్తే ఆ సొమ్ము వృథా అవుతుందని అన్నారు. మరో విషయం ఏంటంటే, మరో వేదిక కట్టేవరకు ప్రభుత్వ సమావేశాలను నిర్వహించుకోవాలంటే ప్రైవేట్ వేదికలకు డబ్బు ఖర్చవుతుంది. కాబట్టి ముందుగా మిగతా అక్రమ నిర్మాణాలను తొలగించి, ఈ లోపు కొత్త సమావేశ వేదిక నిర్మించి, అప్పుడు ఈ ప్రజావేదిక తొలగిస్తే బావుంటుంది అంటూ తన అభిప్రాయాలను వెల్లడించారు కేశినేని.

Latest Updates