టీడీపీ సీనియర్ నేత ఆత్మహత్యాయత్నం

టీడీపీ సీనియర్ నేత బంగి ఆనంతయ్య ఆత్మహత్య యత్నం చేశారు. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యయత్నం చేసిన బంగి అనంతయ్యను  కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. భార్య, కూతురును కూరగాయల కోసం మార్కెట్ కు పంపి ఇంట్లో ఉరేసుకునేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆనంతయ్యకు చికిత్సఅందిస్తున్నారు. ప్రస్తుతానికి అనంతయ్యకు ప్రాణాపాయం లేదన్నారు వైద్యులు. అయితే పార్టీలో తగిన గుర్తింపుదక్కకపోడం, ఆర్థిక ఇబ్బందులే కారణమని చెబుతున్నారు సన్నిహితులు. చంద్రబాబు డబ్బులు ఇస్తానని చెప్పి రెండుసార్లు విజయవాడ వెళ్లినా స్పందించలేదని..అందుకే తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారని బంగి కుమారుడు శ్రీధర్ అన్నారు.

Latest Updates