మాజీ ఎంపీ శివప్రసాద్ కు అస్వస్థత

తిరుపతి: టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెన్నునొప్పితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపొలో ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. స్వతహాగా సినీ నటుడైన శివప్రసాద్‌ ఎంపీగా ఉన్నప్పుడు తన విలక్షణ శైలి, విచిత్ర వేషధారణలతో నిత్యం వార్తల్లో ఉండేవారు. ప్రత్యేక హోదా ఉద్యమం సందర్భంగా ఎంజీ రామచంద్రన్, కరుణానిధి, అంబేడ్కర్..ఇలా రోజుకో వేషంతో పార్లమెంటు ముందు నిలబడి నిరసన తెలిపేవారు.

విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆసుపత్రి యాజమాన్యంతో ఫోన్‌లో మాట్లాడారు. శివప్రసాద్‌కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అనంతరం శివప్రసాద్‌ కుటుంబసభ్యులతో కూడా చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. చిత్తూరు నుంచి 2009, 2014లో రెండు సార్లు టీడీపీ తరపున గెలిచిన శివప్రసాద్.. గత ఎన్నికల్లో ఇదే స్థానంలో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమిపాలయ్యారు.

Latest Updates