కరోనా నుంచి కోలుకున్నా వదలని మృత్యువు.. తణుకు మాజీ ఎమ్మెల్యే మృతి

కరోనా నుంచి కోలుకున్నా కూడా ఆయనను మృత్యువు వదలలేదు. తణుకు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం సీనియర్ నాయకుడు వైటీ రాజా కరోనా నుంచి కోలుకొని ఇంటికి వెళ్లిన 10 రోజుల తర్వాత అనారోగ్యంతో మృతిచెందారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే యలమర్తి తిమ్మ రాజా కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడ్డారు. దాంతో ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని 10 రోజుల కింద కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా ఆయన మరోసారి అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతితో నియోజకవర్గంలో విషాధషాయలు అలుముకున్నాయి. వైటీ రాజా తెలుగుదేశం పార్టీ తరఫున 1999లో తణుకు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2004, 2009లో టీడీపీ తరఫునే పోటీచేసిన ఆయన పరాజయం పాలయ్యారు. రాజా మృతి పట్ల టీడీపీ నేతలు తమ సంతాపం ప్రకటించారు.

For More News..

13 ఏళ్ల బ్యాన్ తర్వాత అందుబాటులోకి గర్భనిరోధక మాత్రలు

బీజేపీ సీనియర్ నేత మృతి.. సంతాపం తెలిపిన ప్రధాని మోడీ

కోవిడ్ హాస్పిటళ్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి

Latest Updates