టీడీపీకి గుడ్ బై చెప్పిన శోభారాణి

యాదాద్రి : టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను  పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు అందజేశారు.  ప్రస్తుత పార్టీ పరిస్థితి గురించి ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందని, ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం తప్ప…. వేరే గత్యంతరం  కనిపించడం లేదన్నారు.  15 ఏళ్లుగా పార్టీలో పని చేసిన తనకు చంద్రబాబు వివిధ పదవులిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో రాజకీయ భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకుంటానని శోభారాణి అన్నారు.

Latest Updates